Monday, 20 October 2014
Saturday, 1 March 2014
Devarayanadurga Temple Bangalore
Bangalore, maratahalli నుంచి around 90 km దూరంలో ఉన్న దేవరాయణదుర్గ గుడి, ప్రకృతి ఒడిలో ఒదిగిన కొండపైన, చల్లని పిల్లగాలులతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఈ ప్రాంతంను కరిగిరి అని కూడా అంటారు. కరి అంటే ఏనుగు, గిరి అంటే కొండ. దేవరాయనదుర్గ కొండ తూర్పు వైపు నుండి చూసినపుడు ఒక ఏనుగు పోలి ఉంటుంది అందువల్ల ఆ పేరు వచ్చింది. 1696 లో ఈ కొండలు మైసూర్ రాజు 'చిక్క దేవరాజ వడయార్' స్వాధీనమైనవి, తనపేరుమీద ఆ కొండలకు దేవ్‌రాయణదుర్గ అనే పేరు వచింది.
Wednesday, 12 February 2014
Bull Temple
Bull Temple Road,
Bangalore,
Karnataka - 560019,
India.
పరమేశ్వరుని వాహనమే నంది. హిందూమతంలో పవిత్ర ఎద్దును, నందిగా ఆరదిస్తారు.
1537 లో విజయనగర సామ్రాజ్యంలోని ఒక స్థానిక పాలకుడు ద్వారా విజయనగర శిల్ప శైలిలో ఆలయం నిర్మించారు. ఆ పాలకుడే చోళులలోని చీఫ్ 'కెంపె గౌడ', బెంగుళూర్ నగరాన్ని కూడా స్థాపించారు.
ఆలయం లోపలి పెద్ద నంది విగ్రహం ఎత్తు 4.5 మీటర్లు, పొడవు 6.5 మీటర్లు ఉంది. ఈ విగ్రహంను ఒకే ఒక రాతితో చేశారని చెబుతారు. నంది తలపై ఒక చిన్న ఉక్కు పలక ఉంది. సంప్రదాయం ప్రకారం, ఈ ఉక్కు పలక పెరుగుతున్న నంది విగ్రహంను నిరోధిస్తుంది అని అంటారు.
పురాణాల ప్రకార నంది వేరుశనగ పంటను కొంత తిని మిగిలినది నాశనం చేస్తుంది. నందిని బుజ్జగించడానికి ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఈ సందర్బంగా బసవనగుడి రైతులు వేరుశనగ ఉత్సవం (Kadalekai Parase) నిర్వహించారు. ఈ ఉత్సవం ఇప్పటివరకు కొనసాగుతుంది, పెద్ద సంఖ్యలో బెంగుళూర్ ప్రజలు హాజరవుతుంటారు.
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEis96hMXJd7tt3XMxmKiNJA-1bewIT8HgjXSO9vA-z5w-1SUM15JBV0x0FnR-g24rR_qagyz1x7RZ6zjasBsCagCRxkrdJKXqJi2A4cjN49FYIcVaq0QM7TWzrL517t-xcVYbPaiut4wDbf/s1600/DSC_0055.jpg)
Route Map (From Majestic to Bull temple):

Monday, 3 February 2014
Sree Malyadri LakshmiNarasimha swami
Malakonda,
Prakasam(District),
Andhrapradesh (State),
India.
శ్రీమన్నారాయణ స్వామి అవతారమే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి.
ఒక రోజు శ్రీమన్నారాయణ స్వామి పాల సముద్రంలోని శేషపాన్పుపై ఉన్నాడు తన పాదాల వద్ద శ్రీ మహాలక్ష్మి కూర్చుని ఉంది. శ్రీమన్నారాయణ స్వామి, శ్రీ మహాలక్ష్మితో అన్నాడు 'ఇప్పుడు ని మదిలో ఎమన్న ఉంటే నాతో చెప్పు నీకోసం నేను చేస్తాను'. వెంటనే లక్ష్మిదేవి అన్నారు 'మీరు నాకు భర్తగా లబించారు, అదే నాకు మహాబాగ్యం. కానీ ప్రస్తుతం భూలోకంలో దైవక్షేత్రాలు చాలా తక్కువ ఉన్నవి, అందు చేత భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన భక్తులు కొరకు ఒక దైవక్షేత్రం నిర్మించండి'.
స్వామి 'వనములను(వనదేవతను)' అందమైన పర్వతాలను భూలోకంలో సృస్టించమని 'వనములను(వనదేవతను)' కోరాడు. అడగకనే దక్కిన వరంచేత మురిసెను. స్వామి కోసం పూల మాల ఆకారంలో పర్వత మాలను సృస్టించెను. అందు చేత ఆ దైవక్షేత్రానికి మాల్యాద్రికొండ (మాలకొండ) అనే పేరు వచింది. ఆగస్త్య మహముని ఈ మాల్యాద్రి పై తపస్సు చెసాడు ఆ తపస్సుకు మెచ్చి ఎర్రని కాంతి తో జ్వలారుపమున స్వామి ప్రత్యక్షమైనాడు అందువలన ఈ స్వామి జ్వాలా నరసింహునీగా ప్రసిద్ధిగాంచాడని పురాణంలో చెప్పబడినది.
స్వామి వారు శనివారం మాత్రమే భక్తులను దిర్శనమిస్తాడు. మిగిలిన ఆరు రోజులు దేవతలకు దిర్శనమిస్తాడు.
విశేషములు : ఈ కొండ పై గల మరొక వింత శ్రీ మహాలక్ష్మి స్వామి వారి పై ప్రణయకోపం తో అలిగి కొండను పగులకొట్టుకొని కొండ శిఖరము పై కూర్చున్నదని పురాణ గాధలలో చెప్పబడినట్లే బ్రాంహందమైన కొండల నడుమ చీలిక ఈరుకైన మెల్లదారి. ఈ దారిలో ఎంతటి స్తులకాయులైననూ నడచి వెళ్ళగలిగే విధముగా నుందుటాయు భక్తులకు అద్భుతం గా తోస్తుంటుంది. ఒకే ఒక రాతి క్రింద ఏర్పడిన విశాలమైన గుహలో శివలింగం ప్రతిష్టించబడి " శివకెశవులు " ఓక్కరెనన్న అధ్యాత్మిక ఉన్నత భావనను కలిగిస్తుంది. శివాలయం దిగువున పార్వతిదేవి ఆలయమున్నది. వేయేల! భారతదేశంలోని అసంఖ్యాక దివ్యక్షేత్రంలలో ఒకటిగా ఎన్నదగినదైన ఈ మలయాద్రిని జీవితంలో ఒకసారైన శ్రీ లక్ష్మీనరసింహుని శరనువేడినవారు దన్యులు . ప్రతిసంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దసి నాడు " నరసింహజయంతి " అనగా ఈ వారంలోని శనివారం నాడు ఉత్సవము దేవాస్తానము వారిచే జరుపబడుచున్నది.
Route Map (From Ongole to Malakonda):
Subscribe to:
Posts (Atom)